• Login / Register
  • జ‌న‌ర‌ల్ న్యూస్‌

    PM Naredra Modi |మ‌న రాజ్యాంగం ఎన్నో దేశాల‌కు స్ఫూర్తి

    PM Naredra Modi |మ‌న రాజ్యాంగం ఎన్నో దేశాల‌కు స్ఫూర్తి
    ప్ర‌జాస్వామ్మ‌న్ని పండుగ‌ల జ‌రుపుకుంటాం
    ఎంద‌రో మ‌హానుభావులు క‌లిసి రాజ్యాంగాన్ని ర‌చించారు
    రాజ్యాంగంపై లోక్‌స‌భ‌లో కీల‌క ప్ర‌సంగం చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి
    Hyderabad : భార‌త పార్ల‌మెంట్‌లో ముఖ్యంగా లోక్‌సభలో రాజ్యంగంపై ప్రధాని మోదీ కీల‌క ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పీఎం ప‌లు కీలక వ్యాఖ్య‌లు చేశారు. ఇవి దేశం గర్వపడే లక్షణాలు అని పేర్కొన్నారు. గ‌డిచిన 75 ఏండ్ల‌ ప్రజాస్వామ్యాన్ని వేడుకగా చేసుకునే క్షణాలివి అని పేర్కొన్నారు. మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూ్ర్తిగా నిలిచిందన్నారు. ఎందరో మహానుభావులు కలిసి రాజ్యాంగాన్ని రచించారని.. వారందరినీ స్మరించారు. దేశంలో మ‌న ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపు కుంటున్నామని ప్రధాని స్ప‌ష్టం చేశారు.దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది అని అభివ‌ర్ణించారు. దేశ అధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారని ఈ సంద‌ర్భంగా ప్రధాని మోడి పేర్కొన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కాలని పిలుపునిచ్చారు. భార‌త‌ రాజ్యాంగం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిల‌బ‌డింద‌న్నారు. భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలని ఈ మేర‌కు ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 
    భార‌త దేశంలో రాజ్యాంగ పండుగను నిర్వహించుకోవడం చాలా గర్వకారణం అన్నారు. ఈ 75 సంవత్సరాలు చిరస్మరణీయమైనవని ఆనందించారు. ఇలాంటి కీలక సమయంలో పార్లమెంట్‌లో తాను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ విజయం అసాధారణమైనదిగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం సాధించిన సమయంలో.. భారతదేశ భవిష్యత్‌పై కలిగిన  ప‌లు సందేహాలు, సవాళ్లను అధిగమించి, మ‌న రాజ్యాంగం మనలను ఇక్కడి వరకు తీసుకువచ్చిందని చెప్ప‌కొచ్చారు. ఇది నిజంగా అద్భుతమైన‌ విజయం అని అభివ‌ర్ణించారు.  రాజ్యాంగ నిర్మాతలతో పాటు.. కోట్లాది మంది భారతీయులకు గౌరవ వందనం తెలుపుతున్నానని ప్రధాని మోదీ ప్ర‌క‌టించారు. భారతదేశం కేవలం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్ర‌మే కాదని,  వేలాది సంవత్సరాల ప్రజాస్వామ్య సంప్రదాయాల కారణంగా ప్రజాస్వామ్యానికి తల్లిగా నిలిచిందన్నారు. ‘ప్రజల మధ్య ఐకమత్యం, దేశాభివృద్ధిలో కీలక పాత్ర షోషిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్ప విధానం. బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. కొందరు స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డాం. మన ఐక్యత దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారు. పేదలకు ఇబ్బంది లేకుండా వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డు తెచ్చాం.’ అని ప్రధాని మోదీ స్ప‌ష్ట‌మైన వ్యాఖ్య‌లు చేశారు
    *  *  *

    Leave A Comment